- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రవేశ పరీక్షలన్నింటినీ ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా విజృంభిస్తున్నందున ఎంసెట్ సహా ఎంట్రెన్స్ పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైదరాబాద్ నగరంలో కరోనా పరిస్థితి, ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఉదయం హైకోర్టు వివరాలు అడిగింది. కేబినెట్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని, లాక్ డౌన్ పై నిర్ణయం కూడా వెలువడుతుందని హైకోర్టు డివిజన్ బెంచ్ కు అడ్వకేట్ జనరల్ మంగళవారం ఉదయం తెలియజేశారు. భోజన విరామం అనంతరం మళ్లీ విచారణ జరగడంతో కరోనా వ్యాప్తి పెరగడం, విద్యార్థులకు ఏర్పడే అసౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోర్సుల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు. ప్రభుత్వం చేసే తదుపరి ప్రకటన అనంతరం మరింత స్పష్టత రానున్నది.
Advertisement
Next Story