- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడు..జీవితకాలంలో 120 గ్యాలన్ల రక్తాన్ని దానం చేశాడు
దిశ, ఫీచర్స్: ఓ మనిషి సాటి మనిషికి ఇచ్చే మహత్తర బహుమానం ‘రక్తం’. ఓ అధ్యయనం ప్రకారం మనదేశంలోనే రక్తం కొరత ఎక్కువగా ఉంది. ప్రతీ రెండు సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది కాగా ఎంతోమంది సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ‘రక్తదానం’ చేస్తే.. ఒక్క ప్రాణాన్నే కాదు దాని ఎర్రరక్త కణాలు, ప్లాస్మా తదితర భాగాలుగా విడగొట్టడం ద్వారా ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడొచ్చు.
ఈ క్రమంలో రక్తదానం చేయాలని కోరుతూ సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ వాళ్ల అభిమానులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ టెక్సాస్‌కు చెందిన మార్కోస్ పెరెజ్ ఇప్పటివరకు 960 సార్లకు పైగా రక్తదానం చేసి, 120 గ్యాలన్ల రక్తాన్ని డోనేట్ చేసి..కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాడు. ‘ఆల్ స్టార్’ బ్లడ్ డోనర్‌గా పేరొందిన అతడిని సౌత్ టెక్సాస్ బ్లడ్ అండ్ టిష్యూస్ సంస్థ ఇటీవలే సత్కరించింది.
పెరెజ్ హైస్కూల్లో ఉన్నప్పుడు తొలిసారిగా రక్తదానం చేశాడు. వైమానిక దళంలో నాలుగేళ్లు పనిచేసిన తర్వాత రోజూ ప్లాస్మా, ప్లేట్‌లెట్లను దానం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 37 ఏళ్ల తర్వాత పెరెజ్ ఇటీవలే 962వ సారి బ్లడ్ డోనేషన్ చేశాడు. ఇది అరుదైన ఘనత కాగా, ఇప్పటివరకు మొత్తంగా 120 గ్యాలన్ల రక్తాన్ని డోనేట్ చేశాడు. తను చేసిన రక్తదానం వల్ల మూడు వేలకు పైగా ప్రాణాలను కాపాడాడు.
‘నేను ప్రీమెచ్యూర్‌గా జన్మించడంతో..రక్త మార్పిడి అవసరమైంది. అప్పటికీ బ్లడ్ బ్యాంకులు లేవు కాబట్టి నాన్న తన బంధువులు, స్నేహితులను నా కోసం రక్తదానం చేయాలని అభ్యర్థించాడు. దాంతో నాన్న స్నేహితుడు ఒకరు రక్తదానం చేయడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఆ తర్వాత రక్తదానం విలువేంటో నాకు తెలిసింది. దాంతో స్కూలింగ్‌లో ఉన్నప్పటి నుంచి బ్లడ్ డోనేట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను రక్తానికి బదులుగా ప్లాస్మా, ప్లేట్‌లెట్లను దానం చేస్తుంటాను. ఎందుకంటే వీటిని ఏడాదికి 24 సార్లు దానం చేయడానికి నిబంధనలు అనుమతిస్తాయి. మీరు చేయలేరని డాక్టర్లు చెప్పే వరకు ప్రతీ రెండు వారాలకు ఒకసారి నేను డోనేషన్ చేస్తాను. ఇక రక్త కొరత ఇప్పటికీ ఉంది. ఒక మనిషి ఒంటరిగా దీన్ని భర్తీ చేయలేడు. మనమందరం కలిసి పనిచేస్తే, అందరూ బ్లడ్ డోనేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ఆ కొరతను తీర్చడమే కాదు, ఎంతోమంది ప్రాణాలను కాపడినవాళ్లమవుతాం’ అని పెరెజ్ చెప్పుకొచ్చాడు.