- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ బందోబస్తు.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ
దిశ, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుంచి రేపు జరిగే ఎన్నికల బందోబస్తు నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ జిల్లా అంతటా ప్రశాంత వాతావరణం కల్పించామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఎనిమిది పోలింగ్ స్టేషన్లలో మొత్తం 937 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉమ్మడి నాలుగు జిల్లాలో అయా ఎస్పీల ఆధ్వర్యంలో ఎన్నికల బందోబస్తు నిర్వహణ ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో అదనపు ఎస్పీతో పాటు డీఎస్పీ స్థాయి అధికారులు ఇన్చార్జీలుగా ఉంటారన్నారు.
పోలింగ్ కేంద్రం ఆవరణలో 50 మంది పోలీసు సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఆదేశాల మేరకు కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అంతటా పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తారన్నారు.