ఫ్లాష్ ఫ్లాష్ : వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రిజర్వేషన్ల కోటా ఖరారు!

by Shamantha N |   ( Updated:2021-07-29 07:44:51.0  )
medical-students
X

దిశ, వెబ్‌డెస్క్ : వైద్య విద్యా కోర్సుల్లో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆలిండియా కోటాలో 2021-22 నుంచి వైద్య విద్యలో OBC లకు 27శాతం, EWS (ఆర్థికంగా వెనుకబడినవారికి)10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. యూజీ, పీజీ, దంత వైద్య, విద్య కోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

దీని ద్వారా 5,550 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుండగా.. ఏటా ఎంబీబీఎస్‌లో 1500 మంది ఓబీసీ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 2500 మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. అదేవిధంగా EWS కోటా కిందట 550 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 1000 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ప్రయోజనం పొందనున్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఏడాదిగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామని స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed