- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'శ్రీమంతుడి' రాకతో 'ఆచార్య'కు భారీ క్రేజ్…
మెగా స్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఖైదీ నం.150, సైరా సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట దర్శకులు. కొరటాల శివ ప్రతీ సినిమాలోనూ మంచి మెస్సేజ్ ఉంటుంది కాబట్టి… దేవాలయ ఆక్రమణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథతోనూ చిరు ద్వారా మంచి మెస్సేజ్ అందించనున్నారు. అయితే చిత్రంలో ఓ ఫ్లాష్ బాక్ ఎపిసోడ్‌లో కీలక పాత్రకు ముందుగా రామ్ చరణ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడట శివ. కానీ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీగా ఉన్న చెర్రీకి డేట్స్ సెట్ కాకపోవడంతో… సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించారు. సినిమా కథ వివరించగా 30 నిమిషాల నిడివి ఉన్న పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాడట మహేష్.
దీంతో మెగాస్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్‌కు తెరతీసిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. దీంతో థియాట్రికల్ రైట్స్‌కు డిమాండ్ పెరిగింది. ఆచార్య థియాట్రికల్ రైట్స్‌ను పొందేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఆల్రెడీ నైజాం హక్కులు లక్ష్మణ్ సొంతం చేసుకోగా… యూఏ రైట్స్ పొందారు సుధాకర్.