వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్

by Shamantha N |
వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్
X

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్ నిలిచిందని, యూనిసెఫ్‌కు పంపిన వ్యాక్సిన్‌లలో 60 శాతం మనదేశంలోనే తయారయ్యాయని సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ వివరించింది. ఏ దేశం టీకాను అభివృద్ధి చేసినా దాని తయారీకి భారత్‌పై ఆధారపడాల్సిందేనని తెలిపింది. ఇక్కడే పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్నదని వివరించింది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ డెవలప్ చేసిన ఏజెడ్‌డీ 1222, యూఎస్ కంపెనీ అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్‌ల తయారీకి భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వెల్లడించింది. భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్ ట్రయల్స్ దశలోకి వెళ్లుతున్నదని, ఇది ఈ మహమ్మారి అంతానికి ఆరంభమని అభివర్ణించింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్ఐవీలతో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్, అహ్మదాబాద్‌కు చెందిన జైదుస్ కాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న జైకొవ్-డి వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed