ఆలియా భట్ డిజిటల్ ఎంట్రీ..భన్సాలీ సిరీస్‌తో?

by Jakkula Samataha |
ఆలియా భట్ డిజిటల్ ఎంట్రీ..భన్సాలీ సిరీస్‌తో?
X

దిశ, సినిమా: ‘గంగూబాయి కతియావాడి’ సినిమా ద్వారా ఆలియా భట్-సంజయ్ లీలా భన్సాలీ మధ్య లాంగ్ లాస్టింగ్ రిలేషన్ షిప్ క్రియేట్ అయిందనే చెప్పొచ్చు. ఈ సినిమా భన్సాలీతో వర్క్ చేయాలనుకున్న ఆలియా డ్రీమ్ ఫుల్ ఫిల్ కాగా ఆలియా మరోసారి అదే డైరెక్టర్‌తో పనిచేసేందుకు సిద్ధమవుతోందని బీటౌన్ టాక్. భన్సాలీ ఎప్పటి నుంచో ‘హీరా మండి’ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ స్టోరీని సిరీస్‌గా తీసుకురాబోతున్నారట. 12 మంది మహిళల చుట్టూ కథ తిరగనుండగా ఇందులో ఆలియా భట్ కూడా నటించనుందని సమాచారం. ప్రతీ క్యారెక్టర్‌కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే ఉండేట్లు స్క్రిప్ట్ సిద్ధం చేస్తుండగా, ఆలియాకు కూడా ఇంపార్టెంట్ రోల్ ఇస్తూ, తగిన స్క్రీన్ టైమ్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా ఆలియా వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Advertisement

Next Story