- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఫర్మామెన్స్‌కు కేరాఫ్ ‘ఆలియా భట్’
బాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజాల తర్వాత వారి వారసులు చాలా మందే ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో కొందరే సక్సెస్ సాధించారు. ఆ విభాగంలో ముందు వరుసలో నిలిచేది ‘భట్’ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆలియా భట్. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటే, బాలీవుడ్‌లో మాత్రం భట్ వంశానికి ప్రత్యేకమైన చోటుంది. తాత ముఖేష్ భట్ వారసత్వాన్ని కుమారుడు మహేశ్ భట్, కూతురు పూజా భట్‌లు కొనసాగిస్తున్నారు. వారి తర్వాత లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హిరోయిన్ ఆలియా తనకంటూ ఓ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కాజోల్ తర్వాత కుర్రకారుగా ఫేవరెట్‌గా మారిపోయింది. వారసత్వాన్ని ఏమాత్రం నమ్ముకోకుండా విభిన్నకథలను ఎంచుకోవడంతో పాటు యాక్టింగ్ పరంగా ఓ మార్క్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన ఏజ్ వారు ఎక్స్‌పోసింగ్‌తో అవకాశాలు దక్కించుకుంటుంటే ఆలియా మాత్రం వాటికి దూరంగా ఉంటూ, నటన పరంగా అవకాశాలు దక్కించుకుంటోంది. కేవలం ఒక్క సినిమా పరంగా కాకుండా దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. 22ఏళ్ల వయస్సులోనే ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ సారధ్యంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ లో మెరిసిన అలియా తన తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘డియర్ జిందగీ, ‘హైవే’, ‘రాజీ’ ఉడ్తా పంజాబ్ మొదలగు సినిమాలు నటన పరంగా అలియాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRRలో ఈ భామ నటిస్తోంది. దిగ్గజ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా, ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మార్చి15న ఆలియా పుట్టినరోజు. ఈ రోజు తన 27th బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
tags ; alia bhatt, mumbai, bhat family, inheritance, 27th birthday, celebrities wishes