తండ్రి కాబోతున్న అలీ.. సంతోషంలో ఫ్యాన్స్

by Shyam |
తండ్రి కాబోతున్న అలీ.. సంతోషంలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొని వీక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్‌లో అలీ రెజా ఒకరు. ఈయన బిగ్ బాస్ షోతో చాలా పాపులర్ అయ్యారు. అయితే తాజాగా అలీ రెజా తన జీవితంలో చాల సంతోషమైన సందర్భం వచ్చిందటు తాను తండ్రి కాబోతున్నట్టు తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. భార్యతో క‌లిసి ఓ వీడియో షేర్ చేయగా, ఇందులో ఆయ‌న భార్య మ‌సూమ బేబి బంప్‌తో క‌నిపిస్తుంది. ఇది చూసిన వారు అతడి సన్నిహితులు, నటీనటులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

మ‌సూమ బిగ్ బాస్ షోలో అలీని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అలీ ఆహ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు.‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’ అనే చిత్రంలోను న‌టిస్తున్నట్టు ఇటీవ‌ల ప్రక‌టించాడు. ఇక సావిత్రి సిరీయల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గా రాణిస్తున్నాడు.

Advertisement

Next Story