నా బాడీ పార్ట్ ఎలా ఉంటే మీకేంటి? : యంగ్ హీరోయిన్

by Shyam |
నా బాడీ పార్ట్ ఎలా ఉంటే మీకేంటి? : యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అలయా ఫర్నీచర్ వాలా.. ‘జవానీ జానేమన్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాకు బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా ఫిల్మ్ ఫేర్ అందుకున్న అలయ.. తాజాగా ఓ వర్చువల్ ఇంటర్వ్యూలో తన ముక్కుపై వచ్చిన కామెంట్స్ గురించి చర్చించింది. తన నోస్ ఒక వైపు నైస్‌గా ఉంటుందని, మరో వైపు లైట్‌గా బంప్ ఉంటుందని చాలా మంది కామెంట్ చేశారని.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని సజెషన్స్ కూడా ఇచ్చారని తెలిపింది. కానీ ఇదంతా పాయింట్‌లెస్ అనిపించిందన్న అలయ.. అలా ఉంటే ప్రాబ్లమ్ ఏంటి? అని ప్రశ్నించింది. ఆ మాత్రానికే సర్జరీ చేయించుకోవడం తనకు నచ్చలేదని తెలిపింది. ప్రపంచంలో ఇది అతిచిన్న విషయమని, దీని గురించి అంతలా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని వివరించింది. అంత చిన్న బంప్‌ను కొందరు గుర్తించి కామెంట్ చేస్తే.. మరికొందరు దాని గురించి అస్సలు పట్టించుకోరని తెలిపింది.

ఇక ఇతర హీరోయిన్లతో పోల్చడాన్ని పాజిటివ్‌గా తీసుకున్న అలయ.. ఈ కంపారిజన్ అద్భుతంగా ఉంటుదని తెలిపింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరు ఎవరికి వారే యూనిక్ అని కోస్టార్స్‌కు కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

Advertisement

Next Story