డింపుల్ అల్లుడిగా గర్వపడుతున్న అక్షయ్

by Shyam |
డింపుల్ అల్లుడిగా గర్వపడుతున్న అక్షయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. డింపుల్ కపాడియా అల్లుడిగా గర్వపడుతున్నట్లు ట్వీట్ చేశాడు. మైండ్ బెండింగ్ డ్రామా ‘టెనెట్’లో ప్రియ పాత్రతో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసిన డింపుల్ కపాడియాకు క్రిస్టోఫర్ నోలన్ నుంచి స్పెషల్ కాంప్లిమెంట్ నోట్ అందడమే ఇందుకు కారణం. క్రిస్టోఫర్ థాంక్స్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అక్షయ్.. ‘టెనెట్ రిలీజ్ రోజు క్రిస్టోఫర్ డింపుల్‌కు హృదయపూర్వకమైన నోట్ రాశాడు. నేను తన స్థానంలో ఉంటే ఆనందంతో కదలలేని పరిస్థితి చూసేవాడిని. టెనెట్‌లో తను మ్యాజిక్ చేయడం చూశాను. మరింత గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని చెప్పాడు.

కాగా క్రిస్టోఫర్ తన థాంక్స్ నోట్‌లో డింపుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘నేను ఏమి చెప్పగలను? మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రియ పాత్రకు ప్రాణం పోసి ప్రపంచానికి చూపించడం చాలా అద్భుతంగా ఉంది. మీ గొప్ప నైపుణ్యం, కృషితో పాటు మీ ప్రతిభను టెనెట్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

కాగా భారత్‌లో ‘టెనెట్’ శుక్రవారం విడుదల కాగా, ఇండియన్ ఆడియన్స్‌కు స్పెషల్ వీడియో మెసేజ్ పెట్టారు క్రిస్టోఫర్. ముంబైలో జరిగిన షూటింగ్ గురించి ప్రస్తావించిన ఆయన.. డింపుల్ కపాడియాతో ఉన్న సన్నివేశాలు ఉత్తేజకరంగా ఉన్నాయని తెలిపారు. ఇండియాలో షూటింగ్ టైమ్ అద్భుతంగా గడిచిందని.. ఫైనల్‌గా మీరందరూ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఆనందిస్తారని నమ్ముతున్నట్లు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed