‘నాజా నాజా’ అంటూ స్టెప్పులేసిన ఇండోనేషియన్స్.. వీడియో వైరల్

by Shyam |
naza naza
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్ జంటగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన సినిమా ‘సూర్యవంశీ’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే సినిమాతో పాటు పాటలు కూడా అభిమానులను అకట్టుకోగా ‘నాజా నాజా’ సాంగ్ నెటిజన్లకు కిక్ ఇచ్చింది. దీంతో ఈ సాంగ్‌ రీక్రియేషన్‌, స్పూఫ్‌లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండోనేషియాకు చెందిన యూట్యూబ్ స్టార్ జంట ‘నాజా నాజా’ పాటకు అద్భుతంగా డ్యాన్స్‌ చేసి మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది.

ఈ వీడియో చూసిన హీరో అక్షయ్ కుమార్ వారి టాలెంట్‌కు ఫిదా అయ్యానని తెలుపుతూ.. ‘మీ రీక్రియేషన్‌ నాకు బాగా నచ్చింది. అద్భుతమైన ప్రయత్నం’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ వీడియోకు 3.6లక్షల వ్యూస్‌ రావడం విశేషం. కాగా ఈ మూవీలో రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవ్‌గన్ అతిథి పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story