- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఖండ మూవీ రివ్యూ.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బాలయ్య
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. సింహా, లెజెండ్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత.. బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య దుమ్ము దులపడం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపించడంతో ఈ సినిమా కోసం యావత్ తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తితో వెయిట్ చేసింది. అంతే కాదు కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా కావడంతో అంచనాలు మించిపోయాయి. మరి అఖండ కథ ఎలా ఉంది, నటీ నటులు వారి యాక్టింగ్ తో మెప్పించారా.? ఫ్యాన్స్ అంచనాలను బోయపాటి అందుకున్నారా.? ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉంది.? ఈ రివ్యూలో చూద్దాం.!
ఈ సినిమాలో ఊరికి పెద్దగా ఉండే బాలకృష్ణ ఎవరికి అన్యాయం జరిగినా సహించడు. బాలయ్య మంచితనం చూసి ప్రేమలో పడిన ప్రగ్య జైశ్వాల్ బాలయ్యను పెళ్లి చేసుకుంటుంది. అదే సమయంలో నటుడు శ్రీకాంత్… వరదరాజులు క్యారెక్టర్ లో అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటాడు. అతడి అకృత్యాలు తెలిసి బాలకృష్ణ రంగంలోకి దిగుతాడు. కొన్ని రోజుల తర్వాత ఓ తప్పుడు కేసులో బాలయ్య జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత వరదరాజులు అరాచకాలు మితిమీరిపోతాయి. ఆ టైంలో బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇస్తాడు. ఇంతకీ ఈ అఖండ ఎవరు? అఘోరాలకు బాలయ్యకు ఉన్న లింక్ ఏంటి ? సాధారణ మనిషి అఘోరాగా ఎందుకు మారాడు ? ఈ రెండు పాత్రలు వేర్వేరా ? ఒక్కటేనా ? అనేదే మిగితా స్టోరీ..
అఖండ సినిమా ఓపెనింగ్ నుంచే అదిరిపోయింది. మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా బోయపాటి తన మార్క్ చూపించాడు. సెకండాఫ్ కూడా అంతకుమించిన మాస్ ఎలిమెంట్స్‌తో అద్భుతంగా వచ్చింది. ఎప్పటిలాగే బాలకృష్ణ హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్ చూపించాడు. ఇక హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది. స్టోరీ రొటీన్ గా ఉండడం తప్ప మిగితా అంతా గూస్ బంప్స్ వచ్చేలా తెరకెక్కించారు. డైరెక్టర్ బోయపాటి సినిమాలో ఎక్కడా లోపం ఎక్కడా థ్రిల్లింగ్ గా సాగింది. యాక్షన్ ఎపిసోడ్స్ లో బాలయ్య నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. ఇక డైలాగుల విషయానికి వస్తే.. నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. రాయలసీమ యాసలో డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. ఇక జై బాలయ్య సాంగ్ మాత్రం ఫ్యాన్స్ పూనకాలు తెప్పించేసింది. లెజెండ్‌లో జగపతిబాబులా ఈ సినిమా హీరో శ్రీకాంత్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనే టాక్ వినబడుతుంది.
ఓవరాల్ గా చూస్తే.. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను మరోసారి తన సత్తా చాటుకున్నాడు. బాలయ్యను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అది ఏమాత్రం తగ్గకుండా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మొత్తం మీద చాలా రోజులుగా నందమూరి అభిమానులను ఊరిస్తూ వస్తోన్న అఖండ గర్జనకు బాక్సాఫీస్ బద్దలైంది. ఫ్యాన్స్ సందడితో థియేటర్లు దద్దరిల్లాయి. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో మరో బంపర్ హిట్ పడిందని చెప్పవచ్చు. ఇక బాలయ్య – బోయపాటి కాంబోలో హైట్రిక్ విక్టరీతో తిరుగులేని రికార్డ్స్ దక్కించుకున్నారు.