- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగంలోకి దిగిన బాలయ్య… 'అఖండ' క్లైమాక్స్ పీక్స్‌లో..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనగానే.. అందరికీ గుర్తొచ్చేది బాలయ్య, బోయపాటి. వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘అఖండ’ టైటిల్ రోర్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సంపాదించి సెన్సేషన్ సృష్టించింది. అఘోర పాత్రలో బాలయ్య ఉగ్రరూపం, డైలాగ్స్ బాలయ్య ఫాన్స్‌కు గూస్ బమ్స్ తెప్పించాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. అఖండ క్లైమాక్స్ షూట్ కోసం బాలయ్య తమిళనాడులో దిగారు. తమిళనాడులోని ఓ దేవాలయంలో క్లైమాక్స్ ఫైట్ సీన్‌ను సినిమా యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ షూట్‌లో బాలయ్యతో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ, ఇతర సినిమా యూనిట్ పాల్గొంది. ఈ యాక్షన్ సీక్వెల్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని, పీక్స్‌లో ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.