హైదరాబాద్ కు రానున్న అజిత్ దోవల్.. ఎప్పుడంటే?

by Sridhar Babu |   ( Updated:2021-11-10 23:51:05.0  )
ajith-Zoyal-1
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హైదరాబాద్ కు రానున్నారని సమాచారం. సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ రేపు జరగనుంది. పరేడ్ కు ముఖ్య అతిథిగా ఆయన హాజరుకానున్నట్లు సమాచారం. 149 ప్రొబేషనరీలు మొదటిదశ బేసిక్ కోర్సు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినవారిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అజిత్ దోవల్ ట్రోఫీలను అందజేయనున్నారని తెలిసింది.

Advertisement

Next Story