అమ్మ కోరిక… క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న : ఐశ్వర్య

by Jakkula Samataha |
అమ్మ కోరిక… క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న : ఐశ్వర్య
X

ఐశ్వర్య రాజేష్… తెలుగు అమ్మాయి అయినా… తమిళ్ లో చేసిన సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. తెలుగులో శైలజా కృష్ణమూర్తి సినిమాతో పరిచయం అయిన ఐశ్వర్య… విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణగా ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే విలువైన సమయాన్ని గడుపుతున్న ఐశ్వర్య… ఎప్పుడూ సినిమాలతో బిజీ బిజీగా ఉండే నాకు ఈ సమయం చాలా ప్లస్ అవుతుందని చెప్పింది. వంట చేయడం నేర్చుకుంటున్నట్లు తెలిపింది. అంతే కాదు నేను నృత్యం నేర్చుకోవాలన్న అమ్మ కళను సాకారం చేసే అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పింది. అమ్మ క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో నేను కూడా భారత నాట్యం నేర్చుకుంటే బాగుంటుంది అని ఎప్పుడూ అంటుందని… ఇప్పటికి ఆ ఆశ తీరుతుందని ఆనందం వ్యక్తం చేసింది. స్కైప్ లో క్లాసికల్ డ్యాన్స్ లెసన్స్ నేర్చుకుంటున్నాను అని చెప్పింది ఐశ్వర్య.

Tags : Aishwarya Rajesh, Tollywood, Kollywood, World Famous Lover, Classical Dance

Advertisement

Next Story