ఐశ్వర్య, బేబీ ఆరాధ్యలకు కరోనా పాజిటివ్

by Jakkula Samataha |   ( Updated:2020-07-12 08:09:49.0  )
ఐశ్వర్య, బేబీ ఆరాధ్యలకు కరోనా పాజిటివ్
X

ముంబైలో విశ్వరూపం చూపిస్తున్న కరోనా వైరస్.. బచ్చన్ ఫ్యామిలీని తాకింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ శనివారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ నేపథ్యంలో.. బిగ్ బీ కుటుంబ సభ్యులైన జయ, ఐశ్వర్య, ఆరాధ్యలతో పాటు ఇంటి సిబ్బందికీ వైద్యులు టెస్టులు నిర్వహించారు. యాంటిజెన్ టెస్ట్‌లో జయా బచ్చన్‌, ఐశ్యర్య, ఆరాధ్యలకు కరోనా నెగెటివ్‌గా తేలింది. అయితే పూర్తి స్థాయి నిర్దారణ కోసం నిర్వహించే ఆర్‌టీ- పీసీఆర్ పరీక్ష ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. అందులో అభిషేక్ సతీమణి ఐశ్వర్య రాయ్‌తో పాటు కూతురు బేబీ ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే ప్రకటించారు. దీంతో బచ్చన్ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed