- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని సేవలను కలుపుతూ ఎయిర్‌టెల్ సరికొత్త ఆల్-ఇన్-వన్ ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఒకే ప్లాన్ ద్వారా మొబైల్ కనెక్షన్‌తో పాటు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, డీటీహెచ్ ఇలా మూడు సర్వీసులను కలిపి ‘ఎయిర్‌టెల్ బ్లాక్’ పేరుతో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా రెండు లేదా దానికంటే ఎక్కువ సేవలను ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ను తీసుకుంటే అన్ని రకాల సేవలను ఒకే గొడుగుగా ఈ ఆల్-ఇన్-వన్ ప్లాన్ అందిస్తుంది. ‘ఎయిర్‌టెల్ బ్లాక్’ ప్లాన్‌లో నెలకు రూ. 998 నుంచి నెలకు రూ. 2,099 వరకు నాలుగు కొత్త ఫిక్స్‌డ్-బండిల్ ప్లాన్లు ఉన్నాయి.
అంతేకాకుండా ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ తీసుకున్న వారికి సింగిల్ బిల్, సింగిల్ కస్టమర్ కేర్ సెంటర్, ప్రత్యేక రిలేషన్ మేనేజర్, కస్టమైజ్‌డ్ ప్లాంట్ లాంటి సౌకర్యాలు పొందవచ్చు. దీంతోపాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బాక్స్ సేవలను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ వల్ల ఎయిర్‌టెల్ సేవలకు ఒక్కోదానికి ఒక్కో బిల్లును చెల్లించే అంతరాయాలను అధిగమించవచ్చని ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవి మాత్రమే కాకుండా కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించే సమయాన్ని తగ్గించేలా నిమిషం వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా మాట్లాడే సౌకర్యాన్ని ఎయిర్‌టెల్ అందిస్తోంది.