- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే ఐదేళ్లలో విమానాశ్రయాల రంగానికి రూ. 90 వేల కోట్ల పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని విమానాశ్రయాల రంగంలో రాబోయే ఐదేళ్లకు రూ. 90,000 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్ తెలిపారు. ఈ మొత్తంలో దాదాపు రూ. 68,000 కోట్లు ప్రైవేట్ కంపెనీల నుంచే రానున్నాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోపోయిన తర్వాత విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, ఇప్పటికే రోజువారీ దేశీయ విమాన ట్రాఫిక్ కరోనా పూర్వస్థాయిలకు చేరుకుంటోందని చెప్పారు.
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల నాటికి విమానాశ్రయాల కోసం మొత్తం రూ. 90 వేల కోట్ల పెట్టుబడులు రానుండగా, ఈ మొత్తంలో రూ. 20,000-22,000 కోట్ల వరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) పెట్టుబడి పెడుతుందని, మిగిలిన మొత్తం ప్రైవేట్ రంగం నుంచి వస్తాయన్నారు. ఐదేళ్లలో మొత్తం 220 విమానాశ్రయాల నిర్వహణతో పాటు హెలీపోర్ట్‌లను కలిగి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో 136 విమానాశ్రయాలు నిర్వహణలో ఉన్నాయి. వీటితో పాటు ఏరోడ్రోమ్‌లను కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన రంగం మెరుగ్గా పుంజుకుంటోంది. భవిష్యత్తులో మునుపటి కంటే వేగంగా వృద్ధి నమోదవుతుందని రాజీవ్ బన్సాల్ వెల్లడించారు.