దేవుడా… ఎంత ప్రమాదం తప్పింది!

by Shamantha N |
దేవుడా… ఎంత ప్రమాదం తప్పింది!
X

సిరియా విమానంలో ఉన్నవారంతా.. కచ్చితంగా దేవుడా.. ఎంత ప్రమాదం తప్పింది.. అని అనుకునే ఉంటారు. ఎందుకంటే యమధర్మరాజు ఆ విమానం పక్కనుంచి సెకెన్ల తేడాలో వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ విమానం దగ్గరకి యమధర్మరాజెందుకు వచ్చాడంటే…

సిరియాకు చెందిన ఎయిర్ బస్ ఏ-320 టెహ్రాన్ నుంచి 172 మంది ప్రయాణీకులతో డమాస్కస్ కు రావాల్సి ఉంది. టెహ్రాన్ లో 172 మంది ప్రయాణీకులను ఎక్కించుకున్న విమానం గమ్యస్థానానికి సాఫీగా వెళ్లిపోతోంది. ఇంతలో ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్ ని తమ సరిహద్దుల్లోకి రానివ్వకుండా చేసేందుకు సిరియా రక్షణ దళాలు క్షిపణులు ప్రయోగించాయి. ఈ క్రమంలో సిరియా రక్షణ దళాలు ఈ ఎయిర్ బస్ పై క్షిపణి దాడి చేశాయి.

క్షిపణి దాడిని సమర్థవంతంగా తప్పించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా రష్యా ఆధీనంలో ఉన్న ఖెమిమ్ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణీకులంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని రష్యా రక్షణశాఖ ప్రతినిధి ప్రకటించారు. కాగా, గతంలో టెహ్రాన్ నుంచి కీవ్ కు బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఇరాన్ దళాలు పొరపాటును కూల్చేయడంతో టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 176 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు.

Advertisement

Next Story