48 మంది ఎయిర్ ఇండియా పైలట్ల తొలగింపు

by Harish |   ( Updated:2020-08-15 09:53:57.0  )
48 మంది ఎయిర్ ఇండియా పైలట్ల తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (kovid-19 ) నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ (Public Sector Airlines) ఎయిర్ ఇండియా (Air India) 48 మంది పైలట్ల (Pilots)ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలగింపునకు గురైన 48 మంది పైలట్లు (Pilots) గతేడాది రాజీనామా చేస్తూ.. 6 నెలల నోటీసు (Notice)ఇచ్చిన తర్వాత, దాన్ని ఉపసంహరించుకున్నారు.

ప్రస్తుతం విమానయాన సేవలు (Airlines) పూర్తిస్థాయిలో నిర్వహించడంలేదు. పరిమితంగా, ఆంక్షల మధ్యనే సంస్థలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అయితే, పరిస్థితులు ఎన్నటికీ చక్కబడతాయో తెలియని స్థితిలో సంస్థ నష్టాల (Company losses)ను భరించలేక ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఎయిర్ ఇండియా (Company Losses)ఆర్థికంగా కుదేలైంది. ఉద్యోగులకు వేతనాలను కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది.

అయితే, గతంలో రాజీనామా ఇచ్చిన వారు ఉపసంహరించుకున్న తర్వాత విధుల్లో ఉండగానే అనూహ్యంగా వీరందరినీ తొలగిస్తూ అర్దరాత్రి నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 (kovid-19) ప్రభావం ఎయిర్ ఇండియా (Air India) సంస్థపై అధికంగా ఉంది. భారీ నష్టాలను చూస్తున్నందున జీతాలను కూడా చెల్లించే ఆర్థిక సామర్థ్యం (Financial efficiency) లేదని కంపెనీ లేఖలో పేర్కొంది. కాగా, పైలట్లను (Pilots) తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(Indian Commercial Pilots Association), ఎయిర్ ఇండియా ఛైర్మన్ (Chairman of Air India), ఎండీ రాజీవ్ బన్సాల్‌ను కోరింది.

Advertisement

Next Story

Most Viewed