- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కరోనా మందు ఇదేనా?..హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడితే ప్రమాదం: ఎయిమ్స్
కరోనాకు మందు కనిపెట్టామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మరోవైపు చైనా కూడా కరోనాకి తాము మందు తయారు చేశామని, అందుకే తమ దేశంలో కరోనా కంట్రోల్‌లో ఉందని ప్రకటించారు. ఇంతలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కరోనాకి విరుగుడు పారాసిటమాల్ అని ప్రకటించి నవ్వుల పాలయ్యారు. ఈ క్రమంలో కేరళ వైద్యులు కరోనా వైద్యంలో దగ్గుమందుతో కలిపి పారాసిటమాల్ ఇవ్వడం ద్వారా నిరోధించామని ప్రకటించారు.
అయితే ఇంతకీ కరోనా మందు ఏంటి? అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే అమెరికా, చైనా దేశాల ప్రకటన వెనుక ఆర్థిక లాభం ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా బయటపడ్డాయి. ఏదైనా మందుని తయారు చేసిన తరువాత దానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ట్రయల్స్ తరువాత దాని రియాక్షన్స్ చూసి, ఆ తరువాతే మందును ప్రజలకు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. మరి కరోనా విషయంలో అది జరుగుతుందా? గైడ్ లైన్స్ అనుసరించకుండానే ఈ రెండు దేశాలు మందును కనిపెట్టాయా? లేక ఏదేశం కనిపెట్టినా ఆ ఫార్ములాను కొనేసి, తామే కనిపెట్టామని సొమ్ముచేసుకుందామనుకుంటున్నాయా? అన్న అనుమానాలు తీరకుండానే.. కరోనాకు మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అంటూ ట్రంప్ ప్రకటించారు.
అయితే కరోనాకి ఇదే మందా? దీనిని వినియోగించవచ్చా? దీనిని వినియోగిస్తే కరోనా రాదు అంటూ కొన్ని పత్రికా కథనాల్లో ప్రచురించారు. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎవరు పడితే వారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించ కూడదని హెచ్చరిస్తోంది. సాధారణ వ్యక్తులెవ్వరూ దీనిని వినియోగించకూడదని చెబుతోంది. అలా కాకుండా వినియోగించి కరోనాను దూరం చేసుకుందామని భావిస్తే మాత్రం దాని దుష్పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కరోనా సోకిన వారు మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును వినియోగించాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. అయితే ఇదే దానికి విరుగుడు కాదని, ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగం మాత్రమేనని స్పష్టం చేసింది. పూర్తి వైద్యుల పర్యవేక్షణలో ఈ మందును కరోనా సోకిన రోగులకు, దానికి సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి అందజేస్తున్నారని స్పష్టం చేసింది. అది కూడా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమేనని మరోసారి స్పష్టం చేసింది.
అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడితే సరిపోతుందన్న భావన సరైనది కాదని, అలా చేయవద్దని ఎయిమ్స్ స్పష్టం చేసింది. సాధారణవ్యక్తులెవరూ దీనిని వినియోగించవద్దని ఎయిమ్స్ కోరింది. కోవిడ్ 19 సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి మాత్రమే ఇస్తున్నామని, దీనినే విరుగుడుగా భావించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిని వినియోగించవద్దని ఎయిమ్స్ కోరింది.
Tags: aiims, aiims delhi, corona virus, hydroxychloroquine, covid-19,