- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ.. పంజాబ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి !
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను అడ్డుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్డీయే ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా ప్రకటన చేసి ముసలి కన్నీరు కారిస్తే సరిపోదని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. పంజాబ్‌ను ఆదర్శంగా తీసుకొని కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కొత్త చట్టాలు రూపొందించాలన్నారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 28న సూచించినట్టుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ఆధారంగా రాష్ట్రంలో కొత్త చట్టాలు తెచ్చి రైతులకు కనీస మద్దతు ధరకు భరోసా కల్పించాలన్నారు. రాష్ట్రం తెచ్చే ఈ రైతు చట్టాల ఏకగ్రీవ ఆమోదానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అకాల వరదలకు నష్టపోయిన పంటలకు ప్రతి ఎకరాకు రూ.20వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.