మంత్రులకు ఛాలెంజ్ విసిరిన సంపత్‌కుమార్

by  |
మంత్రులకు ఛాలెంజ్ విసిరిన సంపత్‌కుమార్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తి, చికిత్స అంశంలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనని, ఇంకా తప్పించుకునేందుకు ఇస్టానుసారంగా మాట్లాడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. కరోనా ఇంతగా విజృంభిస్తుంటే పత్తా లేకుండా పోయారని, పైశాచిక ఆనందం ఎవరిదో ప్రజల్లోనే తేల్చుకుందామా అని మంత్రులకు ఛాలెంజ్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో కాంగ్రెస్ అబద్దాలు ఆడుతూ పైశాచిక ఆనందం పొందుతుందని మంత్రులు కేటీఆర్, ఈటెల అనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల మంత్రులు బాధ్యతలు విస్మరించి అబద్దాలు ఆడుతూ ప్రజలను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో జనం పిట్టల్లా రాలుతుంటే మొక్కలు నాటుతూ, సచివాలయం కూలగొడుతున్నారని, ఇది ఎవరి పైశాచిక ఆనందమో తెలుస్తుందన్నారు.

నిన్న 1920 కరోనా కేసులు 11మంది చనిపోయినట్టు ప్రకటించారని ఆ పేర్లు చెప్పాలని దీనిపై తాను ఇద్దరు మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. కేసులు, మరణాలు ఎక్కువ ఉన్నట్టు నిరూపిస్తానని సంపత్ సవాల్ విసిరారు. మంత్రులు చెప్పేవి అబద్దాలని తేల్చకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానన్నారు. దీనికి మంత్రులు సిద్ధంగా ఉండాలని, కరోనాతో జనం చనిపోతుంటే నివారించడంలో విఫలం అవుతున్నారని, దీనిలో పైశాచిక ఆనందం పొందుతూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


Next Story

Most Viewed