అలా చేసి ఉంటే స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకునేది: టి- కాంగ్రెస్ నేత

by srinivas |
koppula raju
X

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం దారుణమని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సరైన కారణం లేదని విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కాపీటివ్ మైన్స్ లేవని.. బయటనుంచి ఐరన్ ఓర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. గతేడాది లక్ష కోట్లకు పైగా ప్రైవేట్, కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చారని అందులో 15 శాతం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించి ఉంటే సంస్థ నిలదొక్కుకునేదని కొప్పుల రాజు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ అనుకూల విధానాలను కేంద్రం అవలంభిస్తుందంటూ ధ్వజమెత్తారు.

ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం వల్ల సామాజికంగా వెనకబడిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూచించారు. ప్రైవేట్ పరం కావడం వల్ల రిజర్వేషన్లు ఉండవన్నారు. రాజ్యాంగాన్ని పాటించకుండా మనుస్మృతి విధానం మేరకు దేశంలో పాలన జరుగుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో డబ్బులు వస్తున్న రంగాలను అమ్మేస్తున్నారని.. ప్రభుత్వ డబ్బుతో డిఫాల్టర్లను కేంద్రం రక్షిస్తుందని విమర్శించారు. లాభాలను ఆర్జిస్తున్న ఎల్.ఐ. సి, ఓఎన్జీసీబీని ప్రైవేట్ పరం చేస్తుందని కొప్పుల రాజు ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed