చిన్నమ్మా నీకు పార్టీ జెండా వాడే హక్కులేదు

by Anukaran |
చిన్నమ్మా నీకు పార్టీ జెండా వాడే హక్కులేదు
X

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చలి శశికళ ఎట్టకేలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో జైలు శిక్షను అనుభవిస్తున్న చిన్నమ్మ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే జనవరి 20న జైలులో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అత్యవసర చికిత్స కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించి కరోనా టెస్ట్‌లు చేశారు. ఈ టెస్ట్‌ల్లో వైరస్ సోకినట్లు తేలింది. అప్పటి నుంచి విక్టోరియా ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా ఆమె ఆరోగ్యం కుదుట పడడంతో ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా శశికళ మేనల్లుడు దినకరన్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ నిర్మించిన భవనానికి వెళ్లారు. ఆ వెళ్లే సమయంలో జయలలిత తరహా కారులో ముందు ఏఐడీఎంకే జెండాతో శశికళ పయనమయ్యారు. అయితే పార్టీ జెండా వాడకంపై మంత్రి జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళ పార్టీలో లేనప్పుడు జెండాఎలా వాడుతారని ప్రశ్నించారు.మరోవైపు మంత్రి జయకుమార్ వ్యాఖ్యలపై శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్పందించారు. శశికళ ఇప్పటికీ ఏఐడీఎంకే జనరల్ సెక్రటరీనేని స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన శశికళ వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉంటారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed