తమిళనాట బీజేపీ పోటీ చేసే స్థానాలివే.. కుదిరిన సీట్ల సర్దుబాటు

by Shamantha N |
bjp to contest 20 seats in tamilnadu
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కాలుమోపాలనీ, దక్షిణాదిన తమ ఉనికిని చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ తమిళనాడులో 20 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. గత కొద్దిరోజులుగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న సీట్ల సర్దుబాటు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. చెన్నైలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళినిస్వామి, డిప్యూటీ సీఎం ఒ.పన్నీర్ సెల్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. మురుగన్, బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సి.టి. రవి సమావేశమై ఇదే విషయమై చర్చించారు.

సీట్ల సర్దుబాటులో భాగంగా తమిళనాట బీజేపీ 20 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనుంది. వీటితో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానంలో కూడా బీజేపీనే పోటీకి దిగనుంది. కన్యాకుమారి మాజీ ఎంపీ వసంతకుమార్ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా.. అంతకుముందు తమకు 60 సీట్లు కేటాయించాలని పట్టుబట్టిన బీజేపీ.. చివరికి 20 సీట్లతోనే సరిపెట్టుకుంది. అయితే బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

ఇది కూడా చదవండి : ఇకనుంచి వాటిమీద పీఎం మోడీ ఫోటో మాయం

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార ఎఐడీఎంకే.. బీజేపీతో పాటు మరిన్ని స్థానిక పార్టీలతో కూడా పొత్తులు పెట్టుకుంది. ఇందులో ప్రముఖ నటుడు విజయ్‌కుమార్ అధ్యక్షుడిగా ఉన్న డీఎండీకే కూడా ఉంది. పొత్తులో భాగంగా డీఎండీకే 23 సీట్లలో పోటీ చేయనుంది.

Advertisement

Next Story