బాలీవుడ్‌లో 'థప్పడ్' వార్

by Shyam |   ( Updated:2020-03-09 02:54:59.0  )
బాలీవుడ్‌లో థప్పడ్ వార్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనుభవ్ సిన్హా కాంబినేషన్‌లో వచ్చిన థప్పడ్ మూవీ బాలీవుడ్ ఐకానిక్‌గా మిగిలిపోతుందని చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాప్సీ నటన, స్టోరీ లైన్, అనుభవ్ సిన్హా టేకింగ్‌కు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అయితే బాఘీ -3 డైరెక్టర్ అహ్మద్ ఖాన్ థప్పడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి. ఒక్క చెంపదెబ్బతో విడాకులు తీసుకునే వరకు వెళ్లడం వింతగా ఉందని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరగ్గా.. దీనిపై క్లారిటీ ఇచ్చాడు అహ్మద్ ఖాన్.

నేను అసలు సినిమా చూడలేదని… థప్పడ్ అనే టైటిల్ వింతగా ఉందని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చాడు. అనుభవ్ నాకు మంచి మిత్రుడని… తన డైరెక్షన్‌లో వచ్చిన క్యాష్, తుమ్ బిన్ లాంటి తన సినిమాలు నాకు కూడా ఇష్టమని తెలిపాడు. ఈ విషయంపై అనుభవ్‌కు ఫోన్ చేశానని.. తను కాల్ లిఫ్ట్ చేసి నవ్వుతూనే ఉన్నాడని .. అర్ధం చేసుకున్నాడని చెప్పాడు. ఇలాంటి అంశాలపై అనవసరమైన రచ్చ చేయొద్దని మీడియాను కోరాడు అహ్మద్ ఖాన్.

tags: Bollywood, Thappad, Ahmed Khan, Anubhav Sinha, Taapsee Pannu

Advertisement

Next Story