- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్లు లేకపోతే రేపు అనేదే లేదు : హీరోయిన్
దిశ, సినిమా : ‘డాక్టర్లు లేకపోతే మానవత్వం లేదు.. వైద్యులు లేకపోతే రేపు అనేదే లేదు..’ అని అభిప్రాయపడింది హీరోయిన్ అహానా కృష్ణ. దేశంలో డాక్టర్లపై దాడులను ఖండించిన ఆమె.. ఇది డాక్టర్ల మీద జరిగిన దాడి కాదు మానవత్వంపై అటాక్ అని ఫైర్ అయింది. ‘ నేను దేవుడిని ఎప్పుడూ చూడలేదు కానీ డాక్టర్లు, నర్సులలోనే దేవుడిని చూశాను.
అలాంటి హెల్త్ వర్కర్స్, వైద్యులపై దాడులు జరుగుతున్నాయంటే భరించలేకపోతున్నా. ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కరోనా సమయంలో రాత్రి పగలు పోరాడుతున్న వారు మంచి రోజులను తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. ప్రతీ డాక్టర్ కూడా హాస్పిటల్స్‌లో సరైన ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నా సరే వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని బ్లేమ్ చేస్తూ దాడులు చేయడం సరికాదు. మ్యాటర్ ఏదైనా సరే హెల్త్ వర్కర్స్‌పై అటాక్ మాత్రం కరెక్ట్ కాదు. డాక్టర్స్ మనకు అవసరం. ఇలాంటి సమయంలో మనకున్న పెద్దదిక్కు వారే.’ అని తెలిపింది అహానా.