అధిక వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

by Kalyani |
అధిక వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
X

దిశ, బొంరాస్ పేట్: ప్రస్తుతం ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులకు ఏవో తిప్పే స్వామి, ఏఈఓ వినోద్ పలు సూచనలు చేశారు. వరి పొలాల్లో, మొక్కజొన్న, పత్తి మొక్కల (సాళ్ళ) మధ్య నీరు నిలవకుండా, బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలి. అధిక వర్షాల వలన పత్తి మొక్కలు పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది. దీని అధిగమించడానికి మొక్క వయసును బట్టి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 19.19.19 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. అదేవిధంగా పంట ఎదుగుదలను పెంచడానికి వర్షాలు తగ్గిన వెంటనే 25 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ ఎరువులను మొక్కకు ఐదు సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలి. అధిక తేమ వల్ల పత్తి మొక్కలకు వేరుకుళ్ళు తెగులు సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదా ఒక గ్రామం కార్బండజిమ్ లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల చుట్టూ నేలపై వారం వ్యవధిలో రెండు సార్లు పోయాలి.

ఈ సమయంలో జొన్న, మొక్క జొన్నలలో అధిక తేమ వలన భాస్వరం తగ్గి (లోపించి), మొక్కలన్ని ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు తగ్గిన తర్వాత, పొటాషియం నైట్రేట్ లేదా 19-19-19, 10 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. వర్షాలు పూర్తిగా ఆగిన తర్వాత అదనపు మోతాదుగా ఎకరాకు 20-25 కిలోల యూరియా,15 నుండి 20 కిలోల మూరేట ఆఫ్ పొటాష్ ను అందజేయాలి. కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉంటే క్లోరంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ లేదా స్చైనటోరం 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారి చేయాలని సూచించారు.

వర్షాలకు వరి నాటు వేసిన పొలాలు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఆ పొలాలను దమ్ము చేసి మళ్లీ స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నేరుగా విత్తుకోవాలి. చల్లటి వాతావరణంలో అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది. దీని నివారణకు ట్రైసైక్లోజొల్ + మానుకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలాని సూచించారు. ఆయిల్ పామ్ తోటలలో మొక్కల మొదళ్లలో నీరు నిల్వకుండ కాలువల ద్వారా తీసివేయాలి. ఆకు తెగుళ్లు, మొవ్వు కుళ్లు నివారణకు క్లోరోపైరిఫాస్ 50 ఈసి 1.5 మీ.లి మరియు కార్బెండజిమ్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.

అదేవిధంగా రైతు బీమా కోసం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 5 చివరి తేదీ అని ఏవో తిప్పేస్వామి తెలిపారు. రైతు బీమాకు 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులు అర్హులన్నారు. వర్షాలు కురుస్తున్నందున పంట పొలాల నుంచి ఎప్పటికప్పుడు వర్షపు నీటిని తొలగించాలి. రైతులు సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు జాగ్రత్తలు పంట నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలకు ఎలాంటి చీడపురుగుల బెడద రోగాలు లేకుండా చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని ఏఈఓ వినోద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed