- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆవు పేడకు భారీ డిమాండ్.. క్యూ కట్టి కొంటున్న విదేశాలు

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పేడ కనిపిస్తే పక్కకు తప్పుకుని వెళ్లిపోతుంటారు. కానీ ఆవు పేడతో అనేక ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా రైతులు ఆవు పేడను ఎరువుగా వాడుతుంటారు. సైంటిఫిక్‌గా కూడా ఆవు పేడలో ఎన్నో దివ్యౌషదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టడంతో విదేశాల్లో సైతం దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరుగుతోంది. కాబట్టి ఇది భారతదేశానికి మంచి ఆదాయ వనరుగా మారునుంది.
చైనా, అమెరికాతో పాటు కొన్ని అరబ్ దేశాలకు భారత్ భారీ ఎత్తును ఆవు పేడను దిగుమతి చేస్తుంది. ఓ నివేదిక ప్రకారం 2023-24 సంవత్సరంలో భారత్ మొత్తం రూ.125 కోట్ల విలువైన ఆవు పేడను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రూ.173.57 కోట్ల విలువైన ఆవు పేడతో తయారు చేసిన ఎరువు, రూ.88.02 కోట్ల విలువైన ఆవు పేడను కంపోస్టుగా ఎగుమతి చేసినట్లు సమాచారం. అంటే ఒక్క ఏడాదిలో భారత్ రూ.386 కోట్ల విలువైన ఆవు పేడను ఇతర దేశాలకు విక్రయించింది.
పేడ వల్ల ఏం లాభం ఇంతలా కొనేందుకు అనే సందేహం చాలా మందిలో కలిగి ఉంటుంది. మన దేశంలాగానే విదేశాల్లో కూడా ఆవు పేడను ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగిస్తారు. అయితే, ఈ పంటల సాగు కూరగాయలు, ధాన్యాల సాగు కోసం కాదు. ఈ పేడను దిగుమతి చేసుకుని ఎండబెట్టి, పల్వరైజ్ చేసి ఖర్జూరం చెట్లకు ఎరువుగా వినియోగిస్తున్నారు. ఖర్జూర పంటల పెరుగుదలకు ఆవు పేడ అత్యంత ప్రయోజనకరమైన పోషక వనరు. దీనిని ఎరువుగా వేస్తే ఉత్పత్తి సాధారణం కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఈ విధంగా కువైట్ సహా ఇతర అరబ్ దేశాల్లో పేడకు డిమాండ్ పెరిగింది.
ఇక చైనా, UKలలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, బయోగ్యాస్ ఉత్పత్తి చేయడానికి పేడను ఉపయోగిస్తారు. అలాగే వ్యవసాయంలో ఎరువుగా, సేంద్రీయ ఎరువుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కిలో ఆవు పేడ రూ.30 నుంచి రూ.50 పలుకుతోంది. గల్ఫ్ దేశాల నుంచి డిమాండ్ పెరగడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
భారత్ నుండి ఆవు పేడను కొనుగోలు చేసే టాప్ 10 దేశాలివే
* మాల్దీవులు
* అమెరికా
* సింగపూర్
* చైనా
* నేపాల్
* బ్రెజిల్
* అర్జెంటీనా
* ఆస్ట్రేలియా
* కువైట్
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)