- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
wheat: గోధుమ పంట వేస్తున్నారా.. అయితే, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి!

దిశ, వెబ్ డెస్క్ : గోధుమలు పండించాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే, వీటికి తడులు వేస్తూ ఉండాలి.ముందుగా గోధుమలు పొసే ముందు భూమి పొడిగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత, పదునైన ఇనుప వస్తువును తీసుకుని కాలువ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న నాలుగు రోజుల తరవాత ఒక్కొక్కటి గోధుమ గింజను వేస్తూ మట్టితో కప్పాలి. ఇలా చేయడం వలన కొత్త మొక్కలు త్వరగా వస్తాయి. రైతులు ఒక వారం తర్వాత నీటిని పెడుతూ నత్రజని వాడాలి. నిపుణుల చెప్పే దాని బట్టి పరిమాణంలో రైతులు యూరియాను వేయాలి. ఇలా చేయడం వలన గోధుమ పంటలో మొగ్గలు వస్తాయి.
తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని పొందుతారు. ఏ పంటలోనైనా నీరు చాలా ముఖ్యమైనది. అదేవిధంగా, ఈ పంటకు సరైన సమయంలో నీరు పెట్టడం చాలా ముఖ్యం. మొదటి తడి గోధుమ పంటలో 21 నుండి 25 రోజుల మధ్య చేయాలి. ఎందుకంటే , ఈ టైం లోనే గోధుమ పంటలో మొగ్గలు వస్తాయి. ఏ పంటలోనైనా కలుపు మొక్కలను నివారించాలి. ఎందుకంటే అవి పంట మొక్కల కంటే వేగంగా పెరుగుతాయి.
అలాంటి సమయంలో పరిస్థితిలో, గోధుమ పంటలో వస్తున్న గిల్లి దందా, కలుపు మొక్కలను తీసి వేయాలి . లేదంటే ఇవి పంటను మొత్తం నాశనం చేస్తాయి. వీటిని నివారించడానికి వివిధ కంపెనీల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.