- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రైతన్న' సినిమా చూడండి- మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి నటించిన ‘రైతన్న’ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ‘రైతన్న’ మూవీ ప్రమోషన్ కార్యక్రమాన్ని మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. “చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యామ్నాయ సినిమాలు తీసే ఏకైక నటుడు ఆర్ నారాయణ మూర్తి అని తెలిపారు. రైతుల సమస్యల గురించి వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ‘రైతన్న’ మూవీ నిర్మించారని చెప్పారు. ప్రజానీకానికి మంచి చేసే అంశాలను ఏ రంగంలో ఉన్నా కాని వాటిని ప్రోత్సహించాలని కోరారు. ఈ నెల 14 న విడుదల అవుతున్న రైతన్న సినిమాను ఆదరించాలన్నారు.”
నటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. “స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తే రైతులు ఏ విధముగా అభివృద్ధి చెందుతారనే అంశాలను తన సినిమా లో చూపించామని చెప్పారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన రైతు చట్టాలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని” కోరారు.