- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. వ్యవసాయ శాఖ అధికారులు ఓవరాక్షన్
దిశ, ఎల్బీనగర్ : గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లోనే వ్యాపారం కొనసాగించేందుకు వ్యాపారులకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. బాటసింగారం మార్కెట్‌లో ప్రభుత్వం కల్పించిన ఏర్పాట్లపై అధ్యయనానికి కోర్టు కమిషనర్‌ను నియమించింది. ఈ నెల 19న నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది. పండ్ల మార్కెట్ తరలింపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మార్కెట్ ఏజెంట్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అనుమతి ఇచ్చినా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ గేట్లు తెరుచుకోలేదు. మార్కెట్‌లోకి ప్రవేశించే గేట్ల వద్ద భారీకెడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి పోలీసులు బలగాలను వ్యవసాయ శాఖ అధికారులు మోహరించారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
హైకోర్టు ఆదేశాలను వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసు ఉండగా అధికారులు పండ్ల మార్కెట్‌ను మూసివేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు కోర్టులపై గౌరవం లేకపోవడం దారుణమనమని మండిపడుతున్నారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంపై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వ్యాపారులు పేర్కొన్నారు.
అర్థరాత్రి హైడ్రామా..
ఈ కేసును ఈ నెల 19కి వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు వ్యాపారులు పండ్ల మార్కెట్‌లో వ్యాపారం చేసుకోచ్చని ఆదేశాలు జారీ చేయడంతో పెద్ద ఎత్తున వ్యాపారులు, రైతులు మంగళవారం అర్థరాత్రి 11.30 గంటలకు పండ్ల మార్కెట్‌కు చేరుకున్నారు. మార్కెట్ లోపలికి ప్రవేశించేందుకు యత్రించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయం అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళనను విరమించారు.
పత్తాలేని అధికారులు
హైకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తాలేకుండా పోయారు. అర్థరాత్రి రైతులు, వ్యాపారులు ఆందోళన చేసిన స్పందించలేదు. ఉదయం కూడా అధికారులు ఎవరూ రాకపోవడం గమనార్హం.