- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విపత్కర పరిస్థితులు ఉన్నా.. రుణమాఫీ : మంత్రులు
దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణలో నేడు రైతు ప్రభుత్వం నడుస్తుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు అన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నేడు ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం చుటిందన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లహారి గార్డెన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్యచరణ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు రాష్ర్టంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. రుణమాఫీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. రైతులు కూడా ప్రభుత్వం సూచించిన విధంగా చెప్పిన పంట వేసి అధిక లాభాలు పొందాలని తెలిపారు. ఈ సదస్సులో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.