కరోనా నివారణకు ఇంటింటా అగ్నిహోత్రం యజ్ఞం..

by srinivas |
కరోనా నివారణకు ఇంటింటా అగ్నిహోత్రం యజ్ఞం..
X

దిశ, కంటోన్మెంట్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణకు వేలాది గృహాలలో ఇంటింటా యజ్ఞాన్ని నిర్వహించారు. ఆర్య సమాజ్ పిలుపు మేరకు సోమవారం ఉదయం 9 గంటలకు ఒకేసారి, ఒకే సమయంలో వేలాది గృహాలలో అగ్నిహోత్రం(యజ్ఞం) నిర్వహించినట్లు ఉభయ రాష్ట్రాల కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ ధర్మతేజ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, విదేశాలలో లక్షలాది మంది ఈ యజ్ఞాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలో ఈ కరోనా మహమ్మారి విలాయతాండవం చేస్తూ నిత్యం వేలాది మందిని సంహరిస్తున్న తరుణంలో వన మూలికలతో తయారు చేసిన హోమ ద్రవ్యం, ఆవు నెయ్యి, కర్పూరం, సమిధులతో అగ్నిహోత్రం(యజ్ఞం) చేయడంవల్ల కరోనా విష అణువులు అంతం చేయడంతోపాటు ఈ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించవచ్చుననే విశ్వాసంతో ‘కరోనా యుద్ధం-వాతావరణాన్ని శుద్ధి చేస్తాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపార. లోక కళ్యాణార్ధం, సర్వే భవంతు సుఖీనా సర్వే సంతు నిరామయా.. అనే భావనతో నిర్వహించబడిన ఈ అగ్నిహోత్రం(యజ్ఞం) కార్యక్రమంలో వేలాది మంది దంపతులు కుటుంబ సమేతంగా ఉత్సాహంతో పాల్గొన్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed