డబ్బులు వేయమంటే కాజేశారు

by srinivas |
డబ్బులు వేయమంటే కాజేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏటీఏంలో డబ్బులు జమ చేసే సిబ్బంది అదే డబ్బును నొక్కేశారు. అనుకున్న ప్రకారం టెక్నీకల్ ఇష్యూ కారణంగా చూపి రూ. కోటికి పైగా లూటీ చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం బయటకురావడంతో నిందితులు కటకటాలపాలయ్యారు. ఆయా ఏటీఎం మిషన్లలో డబ్బులు వేసేసమయంలోనే చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. పలు బ్యాంకుల నుంచి రూ. 1.17 కోట్ల సొమ్మును జేబులో వేసుకున్నారు. అవకతవకలను గుర్తించిన బ్యాంకుల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు వ్యవహారం బయటకొచ్చింది. రైటర్ బిజినెస్ సర్వీస్ లిమిటెడ్ ఏజేన్సీకి చెందిన ఏడుగురు సిబ్బంది ఈ కార్యక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ. 39.40 లక్షలను రికవరీ చేసుకున్నారు. మోసపోయిన బ్యాంకులల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్, చిత్తూర్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.

Advertisement

Next Story