- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్మిక చట్టాలు..రాష్ట్రాల సడలింపులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 40 రోజుల లాక్‌డౌన్ అనంతరం ఇండియాలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు పరిశ్రమల కోసం కార్మిక చట్టాలను సడలిస్తున్నాయి. నాలుగు మినహా, అన్ని కార్మిక చట్టాలను మార్చడానికి ఉత్తరప్రదేశ్ ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా తమ కార్మిక చట్టాల్లో మార్పులు చేసి పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తున్నాయి.
వలస కార్మికులకు భరోసా ఇచ్చి..
మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం చైనా నుంచి వచ్చే కంపెనీలతో సహా మరిన్ని పెట్టుబడులను రప్పించడానికి కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తామని చెప్పింది. రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఫ్యాక్టరీ చట్టాలకు సంబంధించి ఏప్రిల్‌లో మార్పులను తీసుకొచ్చాయి. వీటిలో రోజువారీ పని గంటలు పెరుగుతాయని జాతీయ పత్రిక ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. రానున్న మూడు నెలలు ఈ రాష్ట్రాల్లో ఇలాంటి అత్యవసర చర్యలు అమల్లో ఉండనున్నాయి. పలు రాష్ట్రాల్లోని వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లకుండా ఆపడానికి కర్ణాటక, పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు వారికి సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తున్నాయి. దీనివల్ల కీలకమైన సడలింపు ఉన్న ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆగిపోవని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
యూపీ ఆర్డినెన్స్…
ఇక, ఉత్తరరదేశ్ ప్రభుత్వం మూడేళ్లపాటు చాలా కార్మిక చట్టాలను నిలిపివేసే ఆర్డినెన్స్‌ను గురువారం ప్రకటించింది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ఆర్డినెన్స్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం నాలుగు మినహాయించి రాష్ట్రంలోని అన్ని కార్మిక చట్టాలను సడలించే ‘ఉత్తర ప్రదేశ్ కార్మిక చట్టాల తాత్కాలిక మినహాయింపు ఆర్డినెన్స్-2020’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మినహాయించిన నాలుగు చట్టాలు..భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం-1996, వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్-1923, కార్మిక నిర్మూలన చట్టం-1976, వేతనాల చెల్లింపు చట్టం-1936 లోని సెక్షన్ 5 (సకాలంలో వేతనాలు పొందే హక్కు) రాష్ట్రంలో వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. కార్మిక చట్టాలలో పిల్లలు, మహిళలకు సంబంధించిన నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు పంపించారు.
మూడేళ్ల పాటు…
ఈ సడలింపులు ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు, ఉత్పాదక విభాగాలకు, అలాగే భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పాటు చేసే కొత్త వెంచర్లకు కూడా విస్తరించవచ్చు. కార్మిక సంఘాలకు సంబంధించి అన్ని కార్మిక చట్టాలు, పని వివాదాలను పరిష్కరించడం, నిబంధనలు, ఒప్పందాలు మొదలైనవి ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్ మూడేళ్లపాటు నిలిపి వేయనున్నట్టు తెలుస్తోంది.
రూ. 25 లక్షల కోట్ల లక్ష్యం…
కేంద్రం ఇచ్చిన సూచనల మేరకు..చైనాను వీడుతున్న కంపెనీలను ఆకర్షించేందుకు అనేక రాష్ట్రాలు కార్మిక నిబంధనలను సడలించి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే, ఎమ్ఎస్ఎమ్ఈ, రోడ్డు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరి.. పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం, సీఐఐ వంటి వాటికి సూచనలు అందించారు. అమెరికా, యూకె వంటి దేశాల సంస్థలతో సాంకేతిక ఒప్పందం కుదుర్చుకోవాలని తెలిపారు. దేశ తయారీ రంగంలో రూ. 20 నుంచి రూ. 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
Tags: State Labour Laws, MP Labour Laws, Labour Laws In Uttar Pradesh, Labour Laws, Uttar Pradesh, Yogi Adityanath