- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సుంకాన్ని తగ్గించాలంటున్న మెర్సిడెస్ బెంజ్..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్ల దిగుమతులపై పన్ను తగ్గింపు కోరడాన్ని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మద్దతిచ్చింది. టెస్లా దారిలోనే మెర్సిడెజ్ బెంజ్ సైతం దిగుమతి సుంకం చాలా ఎక్కువగా ఉందని, భారత్‌లోని వినియోగదారులు అమెరికా, ఇతర దేశాలతో పోలిస్తే రెట్టింపు ధరకు కార్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని కంపెనీ అభిప్రాయపడింది. ప్రస్తుతం సీఐఎఫ్ విలువ(ఖరీదు, బీమా, సరుకు) 40 వేల డాలర్ల కంటే అత్యధికంగా ధర ఉన్న దిగుమతి చేసుకునే కార్లపై భారత్ వంద శాతం సుంకం విధిస్తోందని కంపెనీ తెలిపింది.
‘ప్రస్తుతం తక్కువ అమ్మకాలు నమోదవుతున్న భారత్‌లో ఎలక్ట్రిక్స్‌తో పాటు అన్ని రకాల టెక్నాలజీలను అందించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న దిగుమతి సుంకం వల్ల ఆశించిన స్థాయిలో వినియోగదారులను పొందడంలో ఇబ్బందులున్నాయని’ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల గ్లోబల్ టెక్నాలజీతో కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురాగలమని ఆయన పేర్కొన్నారు. కాగా, మెర్సిడెస్ బెంజ్ అభిప్రాయంపై స్పందించిన ఎలన్ మస్క్.. భారత్‌లో దిగుమతి సుంకం ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు. టెస్లాకు తాత్కాలిక ఉపశమనం అందించే భారత్‌లో ఫ్యాక్టరీని స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు.