- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుండెపోటుతోనే కమలాభాయ్ మృతి
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ తండాకు చెందిన నానవత్ కమలాభాయి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. కరోనా నేపథ్యంలో ఈమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో కలెక్టర్ శరత్ కుమార్ విచారణ జరిపించాల్సింగా ఆర్డీవో రాజేంద్ర కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు కమలాభాయ్ మృతిపై శుక్రవారం ఆర్డీవో విచారణ చేయగా గతంలో ఆమెకు రెండుసార్లు గుండె నొప్పి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయాన్ని ఆర్డీవో కలెక్టర్‌కు వివరించారు. ఇదిలా ఉండగా రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయం రూ. 1500 తీసుకునేందుకు రామారెడ్డిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు మృతురాలు వచ్చింది. బ్యాంకు వద్ద క్యూలైన్ ఉండటంతో డబ్బుల కోసం అక్కడ నిలబడింది. సరిగ్గా అరగంటకు ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలింది. గమనించిన అధికారులు ఆమెను కామారెడ్డికి తరలించే ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందిందని ఆర్డీవో తెలిపారు.
Tags: carona, helping fund rs.1500, women died, heart strock, collecter sharath kumar,rdo rajendra kumar