రషీద్‌ఖాన్‌కు మాతృవియోగం

by Shyam |
రషీద్‌ఖాన్‌కు మాతృవియోగం
X

దిశ, స్పోర్ట్స్: ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నింగ్ సంచలనం, సన్‌రైజర్స్ జట్టు సభ్యుడు రషీద్‌ఖాన్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రషీద్ తల్లి గురువారం మరణించారు.

ఈ వార్తను ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘నాకు ఇల్లు లేదమ్మా.. నువ్వే నా ఇల్లు. కానీ ఇప్పుడు నువ్వు కూడా నాతో లేవు. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నిన్ను మిస్ అవుతూనే ఉంటానమ్మా’ అంటూ హృదయ విదారకరమైన పోస్టు పెట్టాడు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు రషీద్ ఖాన్‌ను ఓదారుస్తున్నారు.

తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రషీద్‌ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు తరపునే కాకుండా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున, బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడుతున్నాడు.

Advertisement

Next Story