తాలిబన్ల ఆధీనంలోకి మరో మూడు ప్రావిన్షియల్ రాజధానులు

by vinod kumar |
Taliban Terrorists
X

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ నిర్ణయం అనంతరం వారి ఆక్రమణను మరింత వేగవంతం చేశారు. తాజాగా, దేశంలోని మరో మూడు ప్రావిన్షియల్ రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని అఫ్ఘాన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈశాన్యంలోని బడక్షన్, బగ్లన్, ఫరా ప్రావిన్స్‌ల రాజధానులను, ఆర్మీ హెడ్‌క్వార్టర్లను తాలిబన్లు తమ వశం చేసుకున్నారని తెలిపారు. దీనిపై అఫ్ఘాన్ ప్రభుత్వం, ఆర్మీ ఇంకా స్పందించలేదు. కాగా, వారంలోనే దేశంలోని అతిపెద్ద సిటీలలో ఒకటైన కుండజ్ ప్రావిన్స్ సహా మరో ఆరు ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు మరో మూడు ప్రాంతాలను తమ వశం చేసుకున్నారు. దీంతో దేశంలోని నాలుగింట ఒకవంతు కన్నా ఎక్కువ జనాభా వారి ఆధీనంలోకి వెళ్లిందని స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. అక్కడి ప్రజలు యుద్ధ భయంతో వణుకుతున్నారు. అనేక మంది రాజధాని కాబుల్‌కు వెళ్లి, అక్కడి వీధులు, చెట్ల కిందే తలదాచుకుంటున్నట్టు మీడియా వెల్లడించింది.

Advertisement

Next Story