మరో మలుపు తిరిగిన… ఆ వ్యవహారం

by srinivas |

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరులో కుటుంబంపై దాడి చేసిన పోలీసుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇటీవల భూ వివాదంలో తమ కుటుంబంపై సీఐ బాలయ్య, ఎస్‌ఐ విక్రమ్ దాడి చేశారని బాధితుడు రవి ఆరోపించారు. అయితే దీనిపై ఇప్పటికే స్పందించిన డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి, వారిపై ఎలాంటి దాడి జరగలేదని ప్రకటించిన విషయం తెలిసిందే.

పోలీసులపై కావాలనే కొందరు దుష్పచారం చేయించారని డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవి భార్యపైన ఎలాంటి దాడి జరగకపోయినా, గాయాలున్నాయని ఆసుపత్రలో చేర్చారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed