- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్‌కు వామన్‌రావు చెప్పిన చివరి మాటలివే.!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన లాయర్ దంపతుల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య సమయంలో తమ వాహనానికి మరో వాహనం అడ్డు పెట్టారని మృతుడు వామన్‌రావు డ్రైవర్ సతీష్ వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వామన్‌రావు భార్య నాగమణిని ఎలా చంపారో తెలియదని అన్నారు. తనను పారిపోవాలని వామన్‌రావే చెప్పినట్లు డ్రైవర్ సతీష్ తెలిపారు.
కాగా, వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న కుమార్ కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రైవింగ్ సీటు పక్కనే ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ఉన్నట్లు భావిస్తున్నారు. వామన్‌రావు హత్యకు వసంతరావు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుంజపడుగు గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు, కుంట శ్రీనివాస్ నిర్మించుకున్న ఇంటి విషయంలోనూ వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని దుండుగులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. రామగిరి మండల సమీపంలో వామన్‌రావు కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించి.. వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.