ఉద్రిక్తతల మధ్య లాయర్ దంపతుల అంత్యక్రియలు

by Sridhar Babu |   ( Updated:2023-12-15 17:25:26.0  )
lawyer couple funeral
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల అంత్యక్రియలు వారి స్వగ్రామమైన గుంజపడుగలో ముగిశాయి. పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో మృతదేహాలను గ్రామానికి తరలించారు. అనంతరం సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు. అంతిమయాత్రకు పెద్దఎత్తున జనాలు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి, దీంతో భారీ బందోభస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story