వైరల్: వామన్ రావు మరో ఆడియో కలకలం

by Sridhar Babu |   ( Updated:2023-03-20 22:02:34.0  )
Lawyer Vaman Rao
X

దిశ ప్రతినిది, కరీంనగర్: హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్ రావు మరో ఆడియో వైరల్‌గా మారింది. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై వామన్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తనను శ్రీధర్ బాబు అవమానపర్చాడని వేరే వ్యక్తితో వామన్ రావు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయింది. 20 ఏండ్లుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని అన్నారు. వానికి నీతి లేదు (శ్రీధర్ బాబుకు).. శరణు శరణు అంటూ శ్రీధర్ బాబు వేడుకున్నాడని, ఆయనకు ఆ పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావుకామెంట్ చేశారు. తన కెపాసిటీ ఎంటో చూపిస్తానంటూ ఆయన అన్నారు. జిందగీలో నేను వారి కుటుంబంతో చేతులు కలపను అంటూ ఆడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story