- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కారులో న్యాయవాది దంపతుల నరికివేత..
దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కారులో వెళ్తున్న న్యాయవాది దంపతులను గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటన జిల్లాలోని రామగిరి మండలం కలవచర్లలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు వామన్ రావు, ఆయన సతీమణి ఇద్దరూ హైకోర్టు న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మంథనికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. దంపతులిద్దరినీ కత్తులతో నరికిన అనంతరం అనుమానితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.చావుబతుకుల్లో ఉన్న వామన్ రావు.. తనపై కుంట శ్రీనివాస్ అనుచరులు దాడిచేసినట్లు స్థానికులకు వాంగ్మూలం ఇచ్చారు.
కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి మంథని టీఆర్ఎస్ మండల అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, పెద్దపల్లి జెడ్పీచైర్మన్ పుట్టా మధుకు వ్యతిరేకంగా కూడా ఈయన పలు కేసులను వాదిస్తున్నారు. గతంలో శీలం రంగయ్య లాకప్ డెత్ కేసులోనూ హైకోర్టులో వామన్ రావు పిల్ వేసినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే దంపతుల హత్య జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, వామన్ రావు దంపతులను నరికి చంపడాన్ని న్యాయవాద సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదుచేసుకుని నాలుగు బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్నవారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.