Appleతో Google పోటీ.. దిమ్మ తిరిగే ఫ్యూచర్స్‌తో సరికొత్త వాచ్..

by Harish |   ( Updated:2021-12-03 12:01:16.0  )
google watch
X

దిశ, వెబ్‌డెస్క్ : అతి పెద్ద సెర్చ్ ఇంజన్ సంస్థ Google నుంచి సరికొత్త వాచ్ రానుందని సమాచారం. ప్రతి ఒక్కరి చేతికి అనువుగా ఉండేలా అత్యాధునిక టెక్నాలజీతో Google ఈ వాచ్‌ను తయారు చేస్తుంది. దీనికి Google Pixel వాచ్ అని నామకరణం చేసింది. ఈ వాచ్‌ను వచ్చే ఏడాది(2022)లో విడుదల చేయనుంది. ఇది రౌండ్ డిస్‌ప్లేతో ఆకట్టుకునేలా డిజైన్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్ వాచ్ వివిధ సైజుల్లో లభించే అవకాశాలు ఉన్నాయి, తద్వారా ఇది వివిధ మణికట్టు సైజులకు సరిపోతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే స్టెప్ కౌంటింగ్, హార్ట్ రేట్ మానిటర్‌తో సహా ప్రాథమిక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. Google స్మార్ట్‌వాచ్‌లో Wear OSలో Fitbit ఇంటిగ్రేషన్‌ను కూడా తీసుకురావచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. Google Pixel వాచ్ ఇతర ఫిట్‌నెస్ వాచ్‌ల కంటే అప్‌డేటెడ్ వెర్షన్‌తో ఉండే అవకాశం ఉందని, అలాగే Apple వాచ్ లైన్ పరికరాలతో పోటీ పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed