ఆదిత్య థాకరేకు పాజిటివ్..

by Shamantha N |
ఆదిత్య థాకరేకు పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో మహా సర్కార్ అప్రమత్తమైంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ విధించారు. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.

స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న టూరిజం అండ్ పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరేకు పాజిటివ్ నిర్దారణ కావడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ రూల్స్‌ను పాటించాలని.. ఎవరూ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరే రక్షించుకోవాని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed