- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో 'రీబాక్' తయారీ హక్కులు పొందిన ఆదిత్య బిర్లా గ్రూప్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ రీబాక్‌కు సంబంధించి భారత్‌తోపాటు ఆగ్నేయాసియా ప్రాంతాల్లో తయారీ, పంపిణీ హక్కులను పొందినట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్), రీబాక్ సంస్థలు తమ మధ్య దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందం జరిగినట్టు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఆదిత్య బిర్లా సంస్థ భారత్, ఆసియా దేశాల్లో హోల్‌సేల్, ఈ-కామర్స్, కంపెనీ రిటైల్ స్టోర్లలో రీబాక్ ఉత్పత్తులను విక్రయించనుంది. గతేడాది రీబాక్ బ్రాండ్‌ను ఆడిదాస్ సంస్థ నుంచి అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ 2.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అథెంటిక్ బ్రాండ్స్ గ్రూప్ సంస్థ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలను కొనుగోలు చేసి వివిధ దేశాల్లో ఏవైనా కంపెనీలకు తయారీ, సరఫరా హక్కులను అందిస్తుంది. ఇందులో భాగంగానే భారత్‌లో ఆదిత్య బిర్లాకు రీబాక్ స్టోర్ల నెట్‌వర్క్‌ను అందజేసింది. దీనిద్వారా ఆదిత్య బిర్లా దేశీయంగా క్రీడా సంబంధిత దుస్తులు, అథ్లెటిక్ దుస్తుల మార్కెట్లో పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. స్పోర్ట్స్, ఎక్సర్‌సైజ్ దుస్తుల విభాగం గత కొంతకాలంగా మెరుగైన వృద్ధి సాధిస్తోంది. ప్రతి ఏటా 14 శాతం వృద్ధితో 2024 నాటికి ఈ విభాగం సుమారు రూ. లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.